Saturday, November 23, 2024
HomeTrending Newsమీకూ అదే గతి :రేవంత్ రెడ్డి హెచ్చరిక

మీకూ అదే గతి :రేవంత్ రెడ్డి హెచ్చరిక

Be careful: శ్రీలంక ను రాజపక్సే కుటుంబం ఎలా దోచుకుందో తెలంగాణ ను కేసిఆర్ కుటుంబం అలా దోచుకుంటోందని పార్లమెంట్ సభ్యుడు, పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.  అక్కడి లాగే ఇక్కడ కూడా కేసిఆర్ కుటుంబం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయంపై  స్పష్టమైన విధానం ఉందని, వరంగల్ రైతు డిక్లరేషన్ కేవలం డిక్లరేషన్ మాత్రమే కాదని అదొక అగ్రిమెంట్ అని అభివర్ణించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్  అమలు చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని, నెలరోజుల్లోగా 2 లక్షల రూపాయలలోపు  రైతుల రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  తెలంగాణా జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పై ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తమ పార్టీ వ్యవసాయ విధానంపై వివరించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణాను కేసిఆర్ దివాళా తీయించారని, ప్రాజెక్టుల పేరుతో 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని దుయ్యబట్టారు. 65 ఏళ్ళు పాలించిన పార్టీలన్నీ కలిసి 16 వేల కోట్ల అప్పులు చేస్తే,  తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసిఆర్ ఒక్కడే ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని, తెలంగాణ కోసం 1569 మంది చనిపోయారు అని కెసిఆర్ చెప్పారని, కేసిఆర్ సిఎం అయిన తర్వాత ఇప్పటివరకూ 8,400 మంది రైతులు చనిపోయారని రేవంత్ వివరించారు.

వ్యవసాయానికి భూమి డిఎన్ ఏ అని, తెలంగాణాలో భూమి కోసమే విప్లవం వచ్చిందని, కుమరం భీం కూడా జల్, జంగిల్, జమీన్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని రేవంత్ గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్