Wednesday, June 10, 2026
Homeసినిమాఎఫ్ 3'లో పెరిగిన గ్లామర్ డోస్!

ఎఫ్ 3’లో పెరిగిన గ్లామర్ డోస్!

Glamour dolls: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ ఏ స్థాయిలో సందడి చేసిందన్నది తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన ‘ఎఫ్ 3′ సినిమాను రూపొందించాడు. వెంకటేశ్ .. తమన్నా .. వరుణ్ తేజ్ .. మెహ్రీన్ .. ఈ రెండు జంటలు ‘ఎఫ్ 2’లోనే ఉన్నాయి. ఒక పక్కన నవ్విస్తూనే ఈ ఇద్దరి భామల గ్లామర్ ను ఒక రేంజ్ లో చూపించారు. స్విమ్మింగ్ సూట్స్ లో వాళ్లని చూపించి కుర్రాళ్లంతా కోమాలోకి పోయేంత పని చేశారు. ఇక కథలో భాగంగా హీరోయిన్స్ కి కల్లు తాగించి మరీ చిందులు వేయించారు. అలా ‘ఎఫ్ 2’ సక్సెస్ కి అందాల సందడి కూడా ఒక కారణమైంది.

ఇక ‘ఎఫ్ 3’ విషయానికి వచ్చేసరికి అంతకుమించి అంటూ అనిల్ రావిపూడి ముందుగానే చెప్పేశాడు. అంటే కథలోని అన్ని రసాలను .. అన్ని పాళ్లను పెంచేస్తున్నట్టుగా చెప్పకనే చెప్పేశాడు. కామెడీ పాళ్లను పెంచడం కోసం ఈ సినిమాలోకి కొత్తగా సునీల్ ను .. అలీని తీసుకున్నారు. చాలాకాలం తరువాత ఈ సినిమాలో పాత సునీల్ ను చూడబోతున్నారని చెబుతూ మరింత ఆసక్తిని పెంచేశారు. సరైన పాత్రలు రావడం లేదని ఈ మధ్య సినిమాల సంఖ్యని తగ్గించిన తాను, ఈ   పాత్రను గురించి వినగానే ఎంతమాత్రం ఆలోచన చేయకుండా ఓకే చెప్పేశానని అలీ అంటున్నాడు.

కామెడీ తో పాటు రొమాన్స్ పాళ్లను కూడా భారీగానే పెంచేసినట్టుగా ట్రైలర్లు .. సాంగ్స్  చూస్తుంటే అర్థమవుతోంది. తమన్నా .. మెహ్రీన్ గ్లామరసం సరిపోదనుకున్నారేమో, సోనాల్ చౌహాన్ ను కూడా రంగంలోకి దింపారు. అందాలు ఆరబోయడంలో సోనాల్ కి ఎంతమాత్రం మొహమాటాలు ఉండవనే విషయం ఆమె గత చిత్రాలు చెబుతూనే ఉంటాయి. ఆమెతో సరిపెట్టకుండా ఐటమ్ సాంగ్ కోసం పూజ హెగ్డేను తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు రొమాన్స్ పరంగా కూడా ఈ సినిమా ఆడియన్స్ ను ఊరిస్తోంది. ఈ కథ డబ్బుచుట్టూ తిరుగుతుందని మేకర్స్ చెబుతున్నారుగానీ, ఆడియన్స్ కళ్లు మాత్రం హాట్ బ్యూటీల ఆటపాటల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది.

Also Read : ఎఫ్ 3 వెంకీకి విక్ట‌రీ అందించేనా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular