హైదరాబాద్ రాయదుర్గంలోని గ్రీన్ బావర్చి హోటల్లో ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటల కారణంగా బిల్డింగ్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. భవనం లోపల 20 మంది చిక్కుకున్నట్టు సమచారరం. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భారీ క్రేన్‌లో సాయంతో రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో కొందరు భవనంపైకి ఎక్కి తమను కాపాడాలంటూ అరుస్తున్నారు. ఒక్కొక్కరిని భారీ క్రేన్ల ద్వారా నిచ్చెన సాయంతో భవనం పైనుంచి కిందకు దింపుతున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.