Saturday, March 14, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కేంద్ర సర్వీసులకు భాస్కర్ భూషణ్

కేంద్ర సర్వీసులకు భాస్కర్ భూషణ్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ డా. భాస్కర్ భూషణ్ ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ  చీఫ్ సెక్రటరీ  ఆదిత్య నాథ్ దాస్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భాస్కర్ భూషణ్  కేంద్ర హోంశాఖలోని రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)లో డిప్యూటీ సెక్రటరీగా నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించనున్నారు.

2019 డిసెంబర్ 9న అయన నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సమైక్య రాష్ట్రంలో కొత్తగూడెం, బెల్లంపల్లి ఏఎస్పీ గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కేడర్ పొందిన అయన పశ్చిమ గోదావరి ఎస్పీగా పనిచేశారు. మంగళగిరి డిజిపి ఆఫీసులో ఏఐజి (అడ్మిన్) గా పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular