Saturday, March 14, 2026
Homeసినిమాజూన్ 17న సుదీప్‌ ‘కే3 కోటికొక్కడు’ రిలీజ్

జూన్ 17న సుదీప్‌ ‘కే3 కోటికొక్కడు’ రిలీజ్

One in Crore: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు వుండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు తాజాగా జూన్ 17న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధాదాస్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఫస్ట్ సింగల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మరో మూడు పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మూవీ ప్రమోషన్స్ ని కూడా స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు నిర్మాతలు. హీరో కిచ్చా సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిందని, తెలుగులోనూ ‘కే3 కోటికొక్కడు’ మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు విశ్వాసంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular