Thursday, March 12, 2026
HomeTrending Newsమరింతగా సేవ చేస్తా: జగన్ హామీ

మరింతగా సేవ చేస్తా: జగన్ హామీ

Reiterate: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి  సరిగ్గా మూడేళ్ళు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.  రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు.

“మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం.

రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా” సామాజిక మాధ్యమాల్లో తన సందేశం అందించారు.

విదేశీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ నేడు తాడేపల్లి చేరుకునే అవకాశం ఉంది.

Also Read : రాష్ట్రంలో వైద్య వ్యవస్థ బలోపేతం – సిఎం జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular