Saturday, November 23, 2024
HomeTrending Newsచివరి భూముల వరకు సాగునీరు: మంత్రి నిరంజ‌న్

చివరి భూముల వరకు సాగునీరు: మంత్రి నిరంజ‌న్

అధునాత‌న వ్య‌వ‌సాయ విధానాల‌ను ఎంచుకోవ‌డంలో రైతులు ముందు వ‌రుస‌లో ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సూచించారు. రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండేలా వ్య‌వ‌సాయ అధికారులు సంసిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. న‌ల్ల‌గొండ‌, యాదాద్రి జిల్లాల వ్య‌వ‌సాయ అధికారుల‌కు, రైతుబంధు స‌మితి స‌భ్యుల‌కు వానాకాలం సాగు స‌న్న‌ద్ధ‌త‌పై నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో మంత్రి జ‌గ‌దీశ్‌ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్ర‌ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతూ వానాకాలం సాగు స‌న్న‌ద్ధ‌త‌పై వర్క్ షాప్‌ల‌ను నిర్వహించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌ వ్యవసాయ రంగంలో నల్ల‌గొండ‌ జిల్లాకు ఎక్కువగా లాభం జరిగింద‌న్నారు. సీఎం కేసీఆర్ కృషి వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు. 2014కు ముందు రైతులు క‌రెంట్ కోసం ధ‌ర్నాలు చేసేవారు.. కానీ నేడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. చివ‌రి ఎక‌రా వ‌ర‌కు కూడా సాగునీరు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇవాళ న‌ల్ల‌గొండ జిల్లా స‌స్య‌శ్యామ‌లం అయింద‌న్నారు.

నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా రైతులకు “వానాకాలం అవగాహన సదస్సు” కు హాజరైన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్