Sunday, January 19, 2025
HomeTrending Newsఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభించిన సిఎం జగన్

ఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభించిన సిఎం జగన్

New App: చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని ఎలాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎక్కడా అవినీతి ఉండకూడదనే విషయాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి చాలా స్పష్టంగా చెబుతున్నామని గుర్తు చేశారు.

అవినీతి నిరోధానికి అనినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఓ మొబైల్‌ యాప్‌ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ ను క్యాంపు కార్యాలయంలో స్పందన పై సమీక్ష సందర్భంగా సిఎం జగన్ ప్రారంభించారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందన్నారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.

మొబైల్ ఫోన్ లో ‘ఏసీబీ 14400 యాప్‌’ను డౌన్లోడ్‌ చేసి… బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేస్తే ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందన్నారు సిఎం. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నామని, ఈ ఫిర్యాదులను ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్