Friday, June 12, 2026
HomeTrending Newsచురుగ్గా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

చురుగ్గా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చరుగ్గా సాగుతోంది. ఈ ఒక్క రోజే 8 ల‌క్ష‌ల డోసులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీరిలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు, ఐదేళ్ళలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇస్స్తున్నారు. అనంతపురం మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ డే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ప్రారంభించారు.

ఏప్రిల్ 15న ఒక్కరోజే 6 లక్షల 28 వేల 961 వ్యాక్సిన్లు వేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు మరోసారి ఒక్కరోజే 8లక్షల డోసులు పంపిణీ చేయాలని లక్షంగా పెట్టుకుంది. మొత్తంగా ఇప్పటివరకు కోటి 22లక్షల 83వేల 479 వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. 5లక్షల 29వేల మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేశారు. ఇప్పటివరకు 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకాను వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular