Bahubali 2.0: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఓ సంచలనం. దేశ, విదేశాల్లో బాహుబలి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అలాగే రాజమౌళి రేంజ్ కూడా. అంతే కాకుండా.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి. దీంతో బాలీవుడ్ మేకర్స్ కూడా ఈ రేంజ్ లో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అదే టార్గెట్ గా బ్రహ్మస్త్ర అనే మూవీ చేశారు.
ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీలక పాత్రలు పోషించడం విశేషం. బాలీవుడ్ కపుల్స్ రణబీర్, ఆలియా భట్ జంటగా నటించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. అమితాబ్, నాగ్ కలిసి నటిస్తుండడం.. రాజమౌళి సమర్పిస్తుండడంతో టాలీవుడ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ మూవీ ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇది బాలీవుడ్ నుంచి వస్తోన్న బాహుబలి మూవీ అని చెప్పారు. దీంతో బాహుబలి రేంజ్ సక్సెస్ బ్రహ్మస్త్ర సాధిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాని విజేయేంద్ర ప్రసాద్ కు మొదట చూపించారట. అయితే.. విజయేంద్ర ప్రసాద్ సినిమా చూసిన తర్వాత కొన్ని మార్పులు చేయాలని చెప్పడంతో ఆయన ఆలోచనా విధానం ప్రకారమే దర్శకుడు చివర్లో కొంత రీషూట్ చేసినట్లుగా కూడా రణ్ బీర్ కపూర్ తెలియచేశారు. భారీ అంచనాలతో వస్తోన్న బ్రహ్మస్త్ర.. మరో బాహుబలి కానుందా..? బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూలు చేయనుందా.? అనేది చూడాలి మరి.
Also Read : ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ అంటోన్న రణభీర్