Sunday, June 14, 2026
Homeసినిమాప్ర‌భాస్ నో చెప్పిన లోకేష్ కి చ‌ర‌ణ్ ఎస్ చెప్పాడా?

ప్ర‌భాస్ నో చెప్పిన లోకేష్ కి చ‌ర‌ణ్ ఎస్ చెప్పాడా?

Charan consent: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ… కెరీర్ లో దూసుకెళుతున్నారు. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, మారుతితో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. అయితే.. ప్ర‌భాస్ కి కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ క‌థ చెప్పార‌ని.. ఈ క‌థ ప్ర‌భాస్ కి న‌చ్చ‌లేద‌ని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు లోకేష్ క‌న‌క‌రాజ్.. యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు.

దీంతో లోకేష్ తో వ‌ర్క్ చేయ‌డానికి స్టార్ హీరోలు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. చ‌ర‌ణ్ తో సినిమా చేసేందుకు గౌత‌మ్ తిన్న‌నూరి, కొర‌టాల వెయిట్ చేస్తున్నారు. ఈ లైనప్‌లో కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ కూడా చేరాడని తెలిసింది. ఇంతకు ముందే చరణ్ – లోకేష్ కలిసి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన కథ రెడీ అయ్యింద‌ట‌.  లోకేష్ నెక్ట్స్ మూవీ విజ‌య్ తో చేయ‌నున్నాడు. ఆత‌ర్వాత చ‌ర‌ణ్ తో ఉంటుంద‌ని టాక్. మ‌రి.. ప్ర‌భాస్ నో చెప్పిన డైరెక్ట‌ర్ కి చ‌ర‌ణ్  ఎస్ చెప్పాడా..?  ఇదే క‌నుక నిజ‌మైతే చ‌ర‌ణ్ ని  ప‌వ‌ర్ ఫుల్ గా లోకేష్ ఎలా చూపించ‌నున్నాడో చూడాలి.

Also Read : సూర్యకు కమల్  గిఫ్ట్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular