తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా)
నైరుతి ఋతుపవనముల స్థితి :
ఈ రోజు జూన్ 13న నైరుతి రుతుపవనములు తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించినవి.
రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరి కొన్ని భాగాలుకు ఆ తదుపరి 2 రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
ఈ రోజు క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నవి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు,ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు
(weather warning) :
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
మరియు రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30నుండి 40 కిమీ వేగంతో)తో కూడిన వర్షంలు, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.