Thursday, March 19, 2026
HomeTrending Newsమహా సంప్రోక్షణకు రండి: సిఎంకు ఆహ్వానం

మహా సంప్రోక్షణకు రండి: సిఎంకు ఆహ్వానం

Invitation: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై నిర్మించిన వకుళామాత ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ నెల 18 న అంకురార్పణంతో మొదలైన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు 23 వరకు జరగనున్నాయి. 23 న ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని అధికారికంగా సిఎం ను ఆహ్వానించి  దీనితో పాటు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేశారు.  టీటీడీ పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Also Read ఆగస్టు 7లోటిటిడి కళ్యాణమస్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular