Wednesday, March 11, 2026
Homeసినిమా‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజ్ కి రెడీ

‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజ్ కి రెడీ

గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్‌ దర్శకత్వం వహించారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ దీన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన విడుదల ఆగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టి విడుదల తేదీ, తదితర విషయాల పై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయ‌ని నిర్మాత రమేష్ తెలిపారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా విడుదల కావడం ఆలస్యం అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. మంచి విజయాన్ని అందిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular