Saturday, September 21, 2024
Homeసినిమాఏజెంట్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

ఏజెంట్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Agent Update: అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ భారీ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్ రెడ్డి క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఎప్పుడెప్పుడు ఏజెంట్ మూవీ వ‌స్తుందా అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా గ‌తంలో ప్ర‌క‌టించారు. ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ కి రావ‌డం లేదు. ద‌స‌రాకి ఏజెంట్ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఏంటంటే.. ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనుకుంటున్నార‌ట‌. ఈ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేది కావ‌డం.. ప్ర‌జెంట్ పాన్ ఇండియా ట్రెండ్ న‌డుస్తుండ‌డంతో ఏజెంట్ ని కూడా పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్.

ఇది అక్కినేని అభిమానుల‌కు గుడ్ న్యూస్ అని చెప్ప‌చ్చు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో అఖిల్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే టీజర్ రిలీజ్ చేయ‌నున్నారు. అఖిల్ నుంచి అభిమానులు ఆశిస్తున్న అంచనాలు ఈ సినిమాతో నెర‌వేరుతాయని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి.. ఏజెంట్ గా అఖిల్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Also Read : ద‌స‌రా బ‌రిలో ఏజెంట్.? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్