Saturday, November 23, 2024
Homeసినిమాచిన్నసినిమాలకు రేట్లు తగ్గించండి : ఎం.ఎస్.రాజు

చిన్నసినిమాలకు రేట్లు తగ్గించండి : ఎం.ఎస్.రాజు

Ticket Rates: మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం 7 డేస్ 6 నైట్స్. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా… మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో ఎంఎస్ రాజు మాట్లాడుతూ… ”థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. థియేటర్ లోపలికి వెళ్లే ముందు ఇద్దరు హీరోయిన్లను ఎవరో అమ్మాయిలు అనుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళను అందరూ చుట్టుముట్టారు. రోజు రోజుకి పెరిగే చిత్రమిది. హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 350 మంది జనంతో చూశాం. మార్వలెస్ ఎక్స్‌పీరియ‌న్స్‌.

మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎమోషన్… ఈ రెండూ ఒకేలా వెళుతుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అది చూసి మేం ఆనందించాం. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. మేం ఆ కష్టం పడ్డాం. ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్. ‘శంకరాభరణం’ నుంచి ఇప్పటి వరకు క్లాసిక్ సినిమాలు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. యూత్‌కు విపరీతంగా నచ్చింది. మార్నింగ్ షో చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. మేం హ్యాపీగా ఉన్నాం.

అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు మన సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. నేను పెద్ద పెద్ద సినిమాలు తీశాను. లో బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు టికెట్ ధర ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతా హ్యాపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే… పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు రేట్లు తగ్గించండి. చిన్న సినిమా కోసం ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద సినిమాలకు ఎంత రేట్ అయినా పెట్టుకోండి. క్రేజ్ ఉంది కాబట్టి థియేటర్లకు జనాలు వస్తారు. చిన్న సినిమాకు ఏదైనా చేయండి. లేదంటే చిన్న సినిమా రాదు” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్