Friday, November 22, 2024
HomeTrending Newsఅత్యుత్తమ క్రీడా : శ్రీనివాస్ గౌడ్

అత్యుత్తమ క్రీడా : శ్రీనివాస్ గౌడ్

క్రీడల అభివృద్ధి లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియంల నిర్మాణం చేస్తున్నామని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామని, మిగతా స్టేడియాల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఒలంపిక్స్ డే సెలెబ్రేషన్స్ – 2021 సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో మంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఒలింపిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి సీఎం కేసీఆర్ క్రీడా పాలసీ ని తయారు చేయటానికి క్యాబినెట్ సబ్ కమిటీ ని  నియమించారని, దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.

టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న తెలంగాణ క్రీడాకారులు సానియా మీర్జా, సాయి ప్రణీత్ లు సత్తాచాటి తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలను పెంచాలని మంత్రి కోరారు. ఇటీవల కరోనా మహమ్మారి తో చనిపోయిన క్రీడా దిగ్గజం మిల్కాసింగ్ తో పాటు  రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్ సభ్యులు, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ సలీం లకు సంతాపం ప్రకటించారు.

వర్చువల్ మీటింగ్ లో తెలంగాణ ఒలంపిక్స్ అసోసియేషన్ సీనియర్ అసోసియేషన్ సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి, SATS చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, ప్రేమ్ రాజ్, హ్యాండ్ బాల్ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ శ్రీధర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ , వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, SATS అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్