Saturday, November 23, 2024
HomeTrending Newsనటి మీనా భర్త హఠాన్మరణం

నటి మీనా భర్త హఠాన్మరణం

Great Loss: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా దానికి చికిత్స పొందుతున్నారని తెలిసింది. జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉండగా.. డోనర్​ లేక వాయిదా పడుతోందని.. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించిందని సమాచారం. బుధవారం విద్యాసాగర్​ అంత్యక్రియలు జరగనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి .

విద్యాసాగర్​ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘విద్యాసాగర్​ ఆత్మకు శాంతి చేకూరాలి.. మీనా, ఆమె కుటుంబసభ్యులకు మా కుటుంబం సంతాపం వ్యక్తం చేస్తోంది’ అని సీనియర్​ నటుడు శరత్​కుమార్​ ట్వీట్​ చేశారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్‌ను మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఇటీవల మీనా.. దృశ్యం 2 సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు ఆమె కుమార్తె నైనిక కూడా కొన్నాళ్ల క్రితం తళపతి విజయ్​ హీరోగా తెరకెక్కిన ‘థేరీ’ చిత్రంతో అరంగేట్రం చేసింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్