Saturday, November 23, 2024
HomeTrending Newsసాలు మోదీ.. సాలు దొర.. ఫ్లెక్సీ వార్‌

సాలు మోదీ.. సాలు దొర.. ఫ్లెక్సీ వార్‌

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలోని కూడళ్లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ పార్టీల పరస్పర వ్యతిరేక ఫ్లెక్సీల వార్‌ ఊపందుకుంది. సాలు దొర.. సెలవు దొర పేరుతో సీఎం కేసీఆర్‌ వ్యతిరేక ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. కౌంటర్‌గా.. బైబై మోదీ.. సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ వ్యతిరేక ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. ఈ వార్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ సైతం స్పందించారు. అధికారులు ఈ ఫ్లెక్సీలను తొలగించే పనిలో ఉన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డు, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ రూ.55 వేల పెనాల్టీ విధించింది. ‘సాలు దొరా.. సెలవు దొర..’ అంటూ నాంపల్లిలోని డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భవన్‌ వద్ద డిజిటల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండనుందనే  వివరాలను అందులో పొందుపర్చారు. ట్విటర్‌ ద్వారా ఓ నెటిజన్‌ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌(సీఈసీ) అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. అక్కడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో బ్యానర్‌, కటౌట్‌ ఏర్పాటు చేసినందుకు రూ.5 వేల జరిమానా విధించింది. రెండు ఈ-చలానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పేరిట జనరేట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినందుకే పెనాల్టీ వేసినట్టు చలానాల్లో పేర్కొన్నారు. జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ బోర్డును మాత్రం తొలగించలేదు. ఇప్పటికీ డిజిటల్‌ బోర్డు అలానే ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్