Saturday, January 18, 2025
Homeసినిమాఅఖిల్ ఏజెంట్ మ‌ళ్లీ వాయిదాప‌డిందా..?

అఖిల్ ఏజెంట్ మ‌ళ్లీ వాయిదాప‌డిందా..?

Once Again:  అక్కినేని అఖిల్ న‌టించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నాలుగ‌వ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’  విజయం సాధించింది.  5వ చిత్రంగా ఏజెంట్ మూవీ చేస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి ఈ మూవీని రూపొందిస్తున్నారు. ‘సైరా’ డిజప్పాయింట్ చేయడంతో ‘ఏజెంట్’తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఈ మూవీ చేస్తున్నాడు.

అందుకే ఏకే ఎంటర్టైన్మెంట్ తో కలిసి సురేందర్ రెడ్డి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నఈ మూవీ షూటింగ్ దశలో వుంది. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో రూపొందుతున్న సినిమా ఇది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు అఖిల్.

ఈ భారీ చిత్రాన్ని 2021 డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే.. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న రిలీజ్ వాయిదా ప‌డింది. 2022లో ఆగస్టు 12న విడుదల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ మ‌రోసారి రిలీజ్ వాయిదాప‌డిన‌ట్టు తెలుస్తోంది. డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట మేక‌ర్స్. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది ఏజెంట్. మ‌రి.. ఎప్ప‌టికి రిలీజ్ అవుతుందో చూడాలి.

Also Read : టీజ‌ర్ రిలీజ్ కాకుండానే.. షేక్ చేస్తోన్న ఏజెంట్. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్