Monday, June 15, 2026
Homeసినిమాఆగస్టులో ‘మాటరాని మౌనమిది’ విడుదల

ఆగస్టులో ‘మాటరాని మౌనమిది’ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని మౌనమిది” సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ… కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంత మందికి ప్రివ్యూ వేశాం. అందరూ బాగుందన్నారు. మల్టీ జానర్ థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక కొత్త లవ్ స్టోరిని చూపిస్తున్నాం. ఆగష్టులో థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. నటీనటులు, టెక్నీషియన్స్ సపోర్ట్ వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

నిర్మాత వాసుదేవ్ మాట్లాడుతూ.. సుకు చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమా చేశాం. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular