Monday, November 25, 2024
HomeTrending Newsపదేళ్లుగా చేస్తూనే ఉన్నారు : సజ్జల

పదేళ్లుగా చేస్తూనే ఉన్నారు : సజ్జల

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని,  గత పదేళ్లుగా ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివిధ వ్యవస్థల ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో అయన సిద్ధహస్తుడనే విషయం అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీదా కొందరు కోర్టుకు వెళుతున్నారని, ఇది సరి కాదని హితవు పలికారు. ఇవన్నీ ఏమి ఆశించి చేస్తున్నారో అర్ధం కావడంలేదని వ్యాఖానించారు.

తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు వైఎస్‌ జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టారని సజ్జల గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం వెలుగు చూశాకే, వైఎస్‌ జగన్‌పై దాదాపు రాష్ట్రంలో దాదాపు 30 కేసులు బనాయించారన్నారు.

2019 ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తమపై ఉన్న అన్ని కేసులను చంద్రబాబు కొట్టేయించుకున్నారని టీడీపీ నేతలపై ఉన్న కేసులను కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం కొట్టేసిందని సజ్జల వెల్లడించారు. మా పార్టీ తరఫున గిద్దలూరు ఎమ్మెల్యే గా గెలిచిన అశోక్ రెడ్డిపై తెలుగుదేశం ప్రభుత్వం బనాయించిన కేసులను ఆ పార్టీలో చేరగానే తొలగించారని సజ్జల వివరించారు. ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5 ఛానల్‌లు విషప్రచారానికి అలవాటు పడ్డాయని, ప్రభుత్వంపై కేసు లిస్టింగ్ అయిన విషయాన్ని ముందే చెబుతున్నారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. కొందరు పదే పదే కేసులు వేస్తూ ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నారని సజ్జల  ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్