Wednesday, June 17, 2026
Homeసినిమాజూలై 16న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్

జూలై 16న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్

Trailer soon: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 16న విడుదల కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ బ్లాక్ టీని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. టీజర్‌ సినిమాలోని యాక్షన్‌ సైడ్‌ని చూపించగా, ట్రైలర్‌ మిగతా ఎలిమెంట్స్ ప్రజెంట్ చేయడానికి సిద్దమౌతుంది.

1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular