Saturday, November 23, 2024
HomeTrending Newsఉపాధి క‌ల్ప‌న అతి పెద్ద‌ స‌వాల్ : మంత్రి కేటీఆర్

ఉపాధి క‌ల్ప‌న అతి పెద్ద‌ స‌వాల్ : మంత్రి కేటీఆర్

నిరుద్యోగం అన్ని ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మారిందని, అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్న‌ప్పుడే అంద‌రికీ ఉపాధి క‌ల్ప‌న సాధ్య‌మ‌వుతుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధును పుట్నాలు, బ‌ఠాణీల మాదిరిగా పంచేందుకు పెట్ట‌లేద‌ని పేర్కొన్నారు. సంప‌ద పున‌రుత్ప‌త్తి కావాలన్న‌దే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని ఉద్ఘాటించారు. పేద‌రిక నిర్మూల‌న కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ సైఫాబాద్‌లో ద‌ళిత్ ఇండియ‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్, మోడ‌లో కేరీర్ సెంట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అమెరికా ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న జో బైడెన్ కావొచ్చు.. దేశాన్ని న‌డుపుతున్న ప్ర‌ధాని మోదీ కావొచ్చు.. రాష్ట్రాన్ని న‌డుపుతున్న సీఎం కేసీఆర్ కావొచ్చు.. అంద‌రి ముందున్న అతి పెద్ద స‌వాల్ ఏంటంటే.. ఉపాధి క‌ల్ప‌న‌, నిరుద్యోగం అని కేటీఆర్ తెలిపారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుకొని విద్యావంతులు అవుతున్నారు. వారి విద్య‌కు, అర్హ‌త‌కు త‌గ్గ ఉపాధి క‌ల్పించ‌డం అంటే ప్ర‌తి ప్ర‌భుత్వానికి అది పెద్ద స‌వాల్ అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ రంగంలో ఉపాధి క‌ల్ప‌న ప‌రిమితంగానే ఉంటుంద‌ని తెలిపారు. మిగ‌తా వారు స్వ‌యం ఉపాధి అవ‌కాశాల వైపు వెళ్లాల‌ని, పారిశ్రామిక‌వేత్త‌లుగా మారాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను రూపొందించి అమ‌లు చేసింద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమ‌తులు ఇస్తున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు.

అంద‌రికీ ఒక‌టే ర‌క్తం, ఒక‌టే బుర్ర‌..
ఒక్కొక్క‌రూ ఒక్క దేవుడిని న‌మ్ముతారు. కానీ వాస్త‌వం ఏంటంటే.. దేవుదు అంద‌ర్నీ స‌మానంగానే పుట్టించారు.అంద‌రికీ ఒక‌టే ర‌క్తం, ఒక‌టే బుర్ర ప్ర‌సాదించార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకో వాస్త‌వం ఏంటంటే.. ఉద్యోగ‌వ‌కాశాలు మాత్రం అంద‌రికీ ఒకే ర‌కంగా ఇవ్వ‌లేదు. దేవుడు మ‌నిషిని పుట్టిస్తే.. ఆ మ‌నిషి మ‌తాన్ని, కులాన్ని పుట్టించాడు. ఈ విష‌యాన్ని కొంత మంది ఒప్పుకోవ‌చ్చు.. ఒప్పుకోక‌పోవ‌చ్చు. మ‌నిషి పుట్టించిన కులం, మ‌తం ఆధారంగా మ‌న‌ల్ని మ‌నం విభ‌జించుకొని జీవ‌నం గ‌డుపుతున్నాం. ఇవి మ‌నం చేసుకున్న కార్య‌క్ర‌మాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మ‌న‌కు క‌న‌బ‌డేది రెండే రెండు కులాలు..
దేశ వ్యాప్తంగా మ‌న‌కు క‌న‌ప‌డేది రెండే రెండు కులాలు.. ఒక‌టి డ‌బ్బున్న‌వాడు.. రెండోది డ‌బ్బు లేనివాడు. ద‌ళితుల్లో కూడా డ‌బ్బున్న వారి ప‌రిస్థితి ఒక‌టి. డ‌బ్బు లేని వారి ప‌రిస్థితి ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఇద్ద‌రే క‌న‌బ‌డుతారు.. ఒక‌టి డ‌బ్బున్న‌వాడు.. రెండోది డ‌బ్బు లేని వాడ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ ఎనిమిదేండ్ల‌లో తెలంగాణ రాష్ట్రం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు స్ఫూర్తివంతంగా మారాయ‌ని డిక్కీ ప్ర‌తినిధులు చెప్తుంటే ఆనందం వేసింద‌న్నారు

Also Read : నిరుద్యోగం ఆందోళనకరం: యనమల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్