Saturday, June 13, 2026
HomeTrending Newsరాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాం - టిపిసిసి

రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాం – టిపిసిసి

రాజ్ గోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగేలా ప్రయత్నం చేస్తున్నామని, ఇదే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఏఐసిసి సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కం టాగోర్, రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమావేశం అయ్యారు.

పార్టీలో కొత్తగా చేరే వారి అంశం కూడా నాయకత్వానికి వివరించామన్నారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే రాజ్ గోపాల్ ఉన్నాడని, రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అంటే ప్రేమ ఉందని నేతలు అన్నారు.   ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో ఈ రోజు పిసిసి నేత ఉత్తమ కుమార్ రెడ్డి సమావేశమై కాంగ్రెస్ పార్టీని వీడకుండా సముదాయించే అవకాశం ఉంది.

Also Read : కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు రాజగోపాల్ రెడ్డి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular