Sunday, June 14, 2026
Homeసినిమా'పుష్ప-2' లో విజ‌య్, ప్రియ‌మ‌ణి?

‘పుష్ప-2’ లో విజ‌య్, ప్రియ‌మ‌ణి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా పార్ట్ 2  క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు సుకుమార్. ఇప్పుడు స్టోరీ లాక్ అయ్యింది. సెట్స్ పైకి వెళ్ల‌డ‌మే ఆల‌స్యం. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ నీ .. కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ప్రియ‌మ‌ణి ఇటీవ‌ల నార‌ప్ప సినిమాలో న‌టించింది. అలాగే విరాట‌ప‌ర్వం సినిమాలోనూ నటించింది. ఇప్పుడు పుష్ప 2 లోనూ నటించనున్న‌ట్టుగా బ‌లంగా టాక్ వినిపిస్తోంది. ఆ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండటం వల్లనే ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకి బాణీలు కట్టే పనిలో ఉన్నారు. అయితే.. విజ‌య్, ప్రియ‌మ‌ణిని ఈ మూవీ న‌టించనున్నార‌నేది నిజ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular