Thursday, June 18, 2026
HomeTrending Newsవరి నాట్ల సంబరాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్

వరి నాట్ల సంబరాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి నాట్ల సంబరాల కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మహిళా రైతులతో కలిసి వరి నాట్లు వేసి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. రైతుల సమస్యలను, వరి నాటు వేస్తున్న తీరును మంత్రి కొప్పుల ఈశ్వర్ అడిగి తెలుసుకున్నారు.

స్వయంగా మంత్రి వచ్చి కార్యక్రమంలో పాల్గొని, తమ సమస్యలు వినటం ఆనందంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జెడ్పీటీసీ లు అరుణ సుధారాణి ఎంపీపీ చిట్టీ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ ప్రజా ప్రతినిధుల రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Readవరి నాటులో వెదజల్లే పద్ధతి ప్రోత్సహించాలి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular