సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్. ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాలో మైక్ టైసన్ నటించడం విశేషం. దీంతో ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో లైగర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆగష్టు 25న లైగర్ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. అయితే.. ఈ మూవీని హిందీలో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. ఇది ఎవరో కాదు.. ఫ్యాన్సే నెగిటివ్ పోస్టులు పెడుతుండడం విశేషం. ఇంతకీ మేటర్ ఏంటంటే.. హైదరాబాద్‌లో మరియు ఆంధ్రాలో సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారు.ముందుగా తెలుగులోనే ఎక్కువ దృష్టి పెట్టాలని, ఆ తర్వాత ఇతర భాషల గురించి ఆలోచించమని విజయ్‌కి వ్యతిరేకంగా కొన్ని సాలిడ్ మెసేజ్‌లు పోస్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ప్రస్తుతం లైగర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మరి.. ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఈ రిక్వెస్ట్ ను విజయ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.
Also Read : చిరు, సల్మాన్ ఆశీస్సులు తీసుకున్న లైగర్