Thursday, March 19, 2026
Homeసినిమాసెప్టెంబర్ 9న 'ఒకే ఒక జీవితం'

సెప్టెంబర్ 9న ‘ఒకే ఒక జీవితం’

విభిన్నమైన కథలు అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే వుంటాయి. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థలో విడుదల కాబోతున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం‘ కూడా అలాంటిదే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, అమ్మ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందాయి.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది.  సుజిత్ సారంగ్ కెమెరాను అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా , సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని పోషించారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమిళంలో ‘కణం’ పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అరువి, తీరన్ అధిగారమ్ ఒండ్రు (ఖాకీ), ఖైదీ, సుల్తాన్ మొదలైన వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంది. ‘ఒకేఒక జీవితం’తో ఈ సంస్థ తెలుగు పరిశ్రమలో తొలి అడుగు వేస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు అందించగలమని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read‘ఒకే ఒక జీవితం’ పాటను అమ్మ‌కు అంకితం ఇచ్చిన అఖిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular