Friday, June 12, 2026
Homeసినిమామ‌హేష్, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మ‌హేష్, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్నఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. సూప‌ర్‌స్టార్  పూజాహెగ్డే  జత కడుతుండగా,  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త అభిమానులలో ఆనందోత్సాహాలు కలిగించింది. అదే ఈ చిత్రం విడుదల తేదీ. 28 ఏప్రిల్, 2023 వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు మ‌హేష్ బాబుకు ఇది 28 వ చిత్రం కావడం, చిత్రం విడుదల తేదీ కూడా 28 వ తేదీ కావడంతో ఈ వార్త విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

Also Read : మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular