గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేటర్లు స్టడీ టూర్ కు వెళ్లి కులుమానాలీలో చుక్కుకుపోయారు. మొండి సమీపంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటిని క్లియర్ చేయడానికి రెండు రోజులు సమయం పడుతుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. కార్పొరేటర్లు తాము ప్రయాణిస్తున్న బస్సులో రోడ్డుపైనే ఉన్నారు. ఆర్మీ సిబ్బంది, అక్కడి అధికార యంత్రాగం వీరు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. వర్షం పడుతుండడంతో తో రోడ్ క్లియర్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది. చండీగఢ్ కు 170 కిలోమీటర్ల దూరం లో ఘటన జరిగింది.
విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్నారు. నిన్న కులు మునిసిపాలిటీలోని పలు ప్రాంతాలను సందర్శించిన కార్పొరేటర్లు. తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ అవరోధం ఏర్పడింది.