Sunday, March 8, 2026
HomeTrending Newsప్రైవేటు వ్యాక్సిన్లు ప్రభుత్వానికివ్వండి: జగన్

ప్రైవేటు వ్యాక్సిన్లు ప్రభుత్వానికివ్వండి: జగన్

ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్న వ్యాక్సిన్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించడం లేదని, వీటిని ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాఇస్తున్నారని, అయితే ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం లేఖలో పేర్కొన్నారు. మిగిలిపోయిన వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘జులై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని’’ లేఖలో కోరారు, ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, చాలా రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో జగన్‌ పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular