తమది విద్యను అందించే విధానమని, ప్రతిపక్షాలది విద్వేషం అందించే తీరని ఇందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడమే నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే ఉన్న 261 గురుకుల స్కూళ్లకు అధనంగా జిల్లాకొకటి చొప్పున కొత్తగా 33 గురుకులాలను, 15 డిగ్రీ కాలేజీలను బీసీలకు కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసిన సందర్భంగా మొత్తంగా బీసీ గురుకులాలు 19 నుండి 310కి పెరిగాయని మంత్రి గంగుల గురువారం కరీంనగర్లో వివరాలను మీడియాకు వెల్లడించారు.
బీసీ గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతి సదుపాయాలతో వీటిలో అడ్మిషన్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భారత దేశ చరిత్రలోనే జరగని విదంగా ఏకకాలంలో 15 డిగ్రీ కాలేజీలను, 33 గురుకుల స్కూల్లను అందించారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల. ఈ సంవత్సరం నుండే వీటిలో మార్కెట్లో డిమాండ్ ఉండే 8 రకాల కంప్యూటర్ సైన్స్ కోర్సులతో ప్రారంభిస్తున్నామన్నారు. వీటి ద్వారా 1200 మంది విద్యార్థులకు అధనంగా 4800 మంది బీసీ బిడ్డలకు లబ్దీ చేకూరుతుందన్నారు మంత్రి గంగుల. డిగ్రీ కాలేజీలను గతంలో ముఖ్యమంత్రి హామీనిచ్చిన విదంగా కరీంనగర్, హాలియాలకు డిగ్రీ కాలేజీలను కేటాయించామని, మిగతా వాటిని కూడా ఎక్కడ ఏర్పాటు చేయనుంది త్వరలోనే తెలియజేస్తామన్నారు.
జిల్లాకొకటి చొప్పున కేటాయించిన 33 బీసీ గురుకులాలకు సైతం స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని వీటిలోనూ ఈ సంవత్సరమే అడ్మిషన్లు అందిస్తున్న నేపథ్యంలో 5,6,7 తరగతులకు కలిపి ప్రతీ విద్యాలయంలో 240 చొప్పున దాదాపు 8000 మంది బీసీ విద్యార్థులకు అధనంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే చాలా గురుకులాలకు సొంత భవనాల్ని సమకూర్చామని, దశల వారీగా అద్దె గృహాల నుండి పక్కా భవనాల్ని నిర్మించి తరలిస్తామన్నారు మంత్రి గంగుల. పెంచిన విద్యాలయాలకు సైతం సిబ్బందిని ఇదే సమయంలో తీసుకుంటామన్నారు.
బీసీ సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన బోజనం, వసతితో పాటు బ్లాంకెట్లు, జాకెట్స్, ట్రాక్ సూట్స్, కిచెన్ యుటెన్సియల్స్ తో పాటు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగాడిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేసామన్నారు. వానాకాలం, చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చేసిన విజ్ణప్తిని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెల్లగానే 80 కోట్లు మంజూరు చేసారని, ఈ సంవత్సరమే అన్ని గురుకులాల్లో సోలార్ వాటర్ హీటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి గంగుల.
తెలంగాణ ఏర్పడక ముందు ఒక్క డిగ్రీ కాలేజీ లేకుండా కేవలం 19 గురుకులాలు 7500 మంది విద్యార్థులు మాత్రమే ఉంటే నేడు 310 గురుకులాలకు పెంచుకొని 16 డిగ్రీ కాలేజీలు, 142 కాలేజీలు, 152 స్కూళ్లతో 1,65,160 మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు మంత్రి గంగుల. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం మంత్రి గంగుల