Sunday, November 24, 2024
Homeసినిమాబరువు పెరుగుతానంటున్న రామ్!

బరువు పెరుగుతానంటున్న రామ్!

హీరో రామ్ ఇటీవ‌ల ‘ద వారియ‌ర్ ‘తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ సినిమాకు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ మూవీ తీవ్రంగా  నిరాశపరిచింది. దీంతో రామ్ ఆశ‌ల‌న్నీ ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో చేస్తున్న సినిమా పైనే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

‘అఖండ’ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్న బోయ‌పాటి శ్రీను…  రామ్ ని ఫుల్ మాస్ అవ‌తారంలో చూపించ‌డానికి ప‌క్కా మాస్ స్టోరీ రెడీ చేశారు. అయితే.. ఈ సినిమాలో రామ్ డ‌బుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో క‌థ డిమాండ్ చేయ‌డంతో ఒక క్యారెక్ట‌ర్ కోసం 11 కిలోలు పెర‌గాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఈ విష‌యం తెలిసి అభిమానులు మాత్రం బ‌రువు పెర‌గ‌ద్దు అంటున్నార‌ని స‌మాచారం.

కార‌ణం ఏంటంటే.. ఒక‌సారి బ‌రువు పెరిగిన త‌ర్వాత మ‌ళ్లీ త‌గ్గాలంటే.. చాలా క‌ష్టం. అందుక‌ని ఇలాంటి ప్ర‌యోగాలు ఇప్ప‌ట్లో వ‌ద్దు అంటున్నార‌ట‌. కెరీర్ లో మంచి ఫోజిష‌న్ లో ఉన్న‌ప్పుడు ప్ర‌యోగాలు చేసి ఫ్లాప్ అయితే కెరీర్ పోతుంది అంటున్నార‌ట‌. రామ్ మాత్రం బోయ‌పాటి సినిమా కోసం ఏం చేయ‌డానికైనా రెడీ అంటున్నాడ‌ట‌. ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టించిన రెడ్, వారియ‌ర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. మ‌రి.. బోయ‌పాటి సినిమాతో అయినా రామ్ స‌క్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Also Read :  వారియ‌ర్ ఎఫెక్ట్.. మార్పులు చేస్తున్న బోయ‌పాటి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్