Thursday, March 12, 2026
HomeTrending Newsతెలంగాణ తీరు సరికాదు : మంత్రులు

తెలంగాణ తీరు సరికాదు : మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల గురించి కూడా ఆలోచించడంలేదని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. డెడ్ లైన్ స్టోరేజి నీటిని కూడా విద్యుదుత్పత్తి పేరుతో వాడుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ లైన్ నిల్వ నీటిని కరెంటు పేరుతో వాడుకుంటున్నారని వివరించారు. చేసే పని తప్పా, ఒప్పా అని కూడా తెలంగాణ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఏపీ క్యాబినెట్ తీవ్రంగా పరిగణిస్తోందని పేర్ని నాని తెలిపారు.

తెలంగాణ తీరుపై ప్రధాని లేఖ: మంత్రి అనిల్‌
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారు. వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలి. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదు. అసవరమైతే ఎంతదూరమైనా వెళ్తాం. ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు?. అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దాం. పాలమూరు, దిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదు. మా సంయమనం చేతకానితనం కాదు. శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోంది. తెలంగాణ తీరుపై ఇవాళే ప్రధానమంత్రి, జల్‌శక్తి మంత్రికి లేఖ రాస్తున్నాం’’ అని మంత్రి అనిల్‌ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular