తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డ్ – 2022 కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కు చెందిన వైతాళికులు, కవులు, సాహితీ వేత్తలు, మేధావుల సేవలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం ఈ అవార్డు ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డు ఎంపిక కోసం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సిపార్సుల మేరకు సాంస్కృతిక శాఖ అధికారులు G o. No. 198 ను (ఉత్తర్వులు) జారీ చేశారు. ఈ అవార్డు క్రింద రూ. లు. 1 లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల (1,01,116/-) నగదు ను, కాళోజీ గారి అవార్డు ను షీల్డ్ ను అందిస్తారు.