Sunday, November 24, 2024
HomeTrending Newsమాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ళ జైలు శిక్ష

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ళ జైలు శిక్ష

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సిబిఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన  ఆమెకు ఈ శిక్ష పడింది.  గీత భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించిన కోర్టు  ఈ అక్రమాలకు  సహకరించిన  బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.  విశ్వేశ్వర ఇన్ ఫ్రా సంస్థకు రెండు లక్షల జరిమానా విధించారు.

విచారణ కోసం  హైదరాబాద్ లోని సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు గీతను పిలిపించిన అధికారులు నేడు ఆమె అరెస్టును ధృవీకరించారు. అనంతరం ఆమెను కోర్టుకు తరలించారు.  విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు 42.79 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించలేనందున బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు బ్యాంకు అధికారులతో కుమ్మకై గీత దంపతులు తప్పు చేసినట్లు నిర్ధారించారు.

ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం గీత తో పాటు మిగిలిన నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్