Sunday, November 24, 2024
Homeసినిమాసినీ కార్మికుల వేత‌నాలు పెంపు

సినీ కార్మికుల వేత‌నాలు పెంపు

తెలుగు సినీ కార్మికులు వేత‌నాలు పెంచాల‌ని కోరుతూ ఆమ‌ధ్య ధ‌ర్నా చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం గురించి నిర్మాత దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో ఫిలింఛాంబ‌ర్ ప్రెసిడెంట్ బ‌సిరెడ్డి, గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ త‌దిత‌రుల‌తో చ‌ర్చించి కార్మికుల వేత‌నాలు పెంచేందుకు అంగీకరించారు.

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరములో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి ప్రస్తుత వేతనాల మీద  పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు 15% పెంచేందుకు అంగీకరించారని,  ఈ పెంచిన వేతనములు 01-07-2022 వ తేదీనుండి 30-06-2025 వరకు అమలులో ఉంటాయని, అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి,ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని ఫిల్మ్ ఛాంబ‌ర్, నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది.

Also Read : రెమ్యూన‌రేషన్ త‌గ్గించుకుంటాం  ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్