బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే మనకు వచ్చిందని, అలాంటి ప్రాజెక్టు వద్దని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారని గుర్తు చేశారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తోన్న ఈ పార్క్ వల్ల 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆ పార్క్ తమకు ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటిఆర్ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని, కానీ దాన్ని వద్దంటూ టిడిపి లేఖ రాయడం దురదృష్టరకమని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రతిరోజూ దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. బాబు హయంలో అక్కడ దివీస్ ల్యాబ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
సిఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
మనం సంక్షేమ పథకాల అమల్లో కూడా పార్టీ బేధం లేకుండా శాచురేషన్ పద్దతిలో అందరికీ ఇస్తున్నాం
కానీ చంద్రబాబు మంత్రం పారిశ్రామిక వేత్తల్లో కూడా నావాళ్ళు ఎవరు… కానివారు ఎవరు అని చూస్తారు
గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.
పారిశ్రామిక అవసరాలకోసం స్కిల్ డెవలప్మెంట్ అందిస్తున్నాం
ఏది చేయగాలుగుతామో అదే చెబుతున్నాం, అదే చేస్తున్నాం
రాష్ట్రానికి దిగ్గజ పారిశ్రామిక కంపెనీలు వస్తున్నాయి. బిర్లా, సన్ ఫార్మా, అదానీ, బయంకా,టాటా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. కరోనా సమయంలో కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో నిలిచాం.
ఇటీవలి కాలంలో పారిశ్రామిక వేత్తలు ఇచ్చే మార్కుల ఆధారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇస్తున్నారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత 99 భారీ పరిశ్రమలు 46,280 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి, వీటి ద్వారా 62,541 మందికి ఉద్యోగాలు వచ్చాయి
35,181 ఎంఎస్ ఎం ఈ ల ద్వారా 9,742 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2,11,374 మందికి ఉపాధి దొరికింది
39,655 కోట్ల పెట్టుబడులతో 55 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ద్వారా 78, 792 మందికి ఉపాధి లభించనుంది
మరో 91,129 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో చర్చల దశలో ఉన్నాయి. ఇవి కూడా పూర్తయితే మరో 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి
విశాఖ, కాకినాడ, కృష్ణా, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కేంద్ర ప్రభుత రంగ సంస్థల ద్వారా 1,06,800 కోట్ల పెట్టుబడులు రానునాయి. వీటి ద్వారా 72,900 మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా తాము ముందంజలో ఉన్నాం
2,06, 638 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 37,098 కాంట్రాక్ట్ జాబులు ఇచ్చాం
3,71,777 మందికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా జీతం అందిస్తున్నాం
ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా, కోపంగా ఉంటారు
మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తున్నవారు యంగ్ జనరేషన్ కు ఇవన్నీ చెప్పాలి
అధికారంలో ఉండగా ప్రజలకు చెప్పుకోదగ్గ మంచి పని ఒక్కటీ చేయలేదు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంటే ఏడవడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేరు
ప్రజలు బాగుంటే, ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు ఏడుస్తారని జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: కృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం