Saturday, November 23, 2024
HomeTrending Newsడేటా చౌర్యం ముమ్మాటికీ నిజం: రోజా

డేటా చౌర్యం ముమ్మాటికీ నిజం: రోజా

డేటా చౌర్యం జరిగిందని రుజువయ్యిందని, ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.  బాబు పెగాసస్  సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లు మమతా బెనర్జీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. వైసీపీకి చెందిన దాదాపు 30 లక్షల ఓట్లు తొలగించేందుకు బాబు కుట్ర పన్నారన్నారు.  నాడు ప్రజలు టిడిపిని ఓడించి వైసీపీని గెలిపించడానికి సిద్ధమయ్యారు కాబట్టే వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే పన్నాగం చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఈడేటా చౌర్యానికి పాల్పడ్డారని చెప్పారు.  ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను  టిడిపిలో చేర్చుకున్నారని రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

హౌస్ కమిటీ నివేదిక సభలో ప్రవేశ పెట్టగానే టిడిపి ఎమ్మెల్యేల గుండెలు జారిపోయారని, ఈ డేటా బాబా డేరా బాబా కన్నా ప్రమాదకరమని చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై మరింత సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్న క్యాంటిన్లపై వాయిదా తీర్మానం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు రోజా. గతంలో హెరిటేజ్ లో అమ్ముడు పోకుండా మిగిలిపోయిన పెరుగు, నెయ్యిని పండుగ కానుకల పేరిట పేదలకు ఇచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు దోచుకున్నారని రోజా విమర్శించారు.

Also Read: రాజకీయం చేస్తున్నారు: మంత్రి రోజా

RELATED ARTICLES

Most Popular

న్యూస్