Saturday, November 23, 2024
HomeTrending Newsఏజెన్సీలో ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ : సిఎం

ఏజెన్సీలో ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ : సిఎం

గృహనిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామని,  ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ, రెవెన్యూ, పురపాలక- పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలని, కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు.  స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, ఆమేరకు పనులు చేపట్టాలని, టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.

2022–23 ఆర్ధిక సంవత్సవరంలో ఇప్పటివరకూ రూ. 4,318 కోట్ల విలువైన పనులుచేశామని అధికారులు వివరించారు.  తొలి విడతలో 15.6 లక్షలు, రెండో విడతలో 5.65 లక్షలు మొత్తంగా 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గగానే ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుందని, అక్టోబరు నుంచి వారానికి 70వేల ఇళ్ల చొప్పున ఒక దశ నుంచి వేరే దశకు నిర్మాణం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని సిఎంకు వివరించారు. ఆప్షన్‌ 3 ( ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న) ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతం చేస్తున్నాని, ప్రతివారం నిర్మాణ సంస్థలతో సమీక్ష చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టాలు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్షించారు.  ఇప్పటికే 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చామని,  మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ప్రన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్సు ఆనంద కుమర్‌ జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్ధ జైన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,  ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్