Thursday, June 11, 2026
HomeTrending Newsవరినాట్లు వేసిన కలెక్టర్లు

వరినాట్లు వేసిన కలెక్టర్లు

ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఆదివారం రైతులతో కలిసి చెమట చిందించారు. పొలాల్లోకి వెళ్లారు. అన్నదాత కష్టాల్ని చూసేందుకు భార్యా, పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్లారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి వరి నాట్లు వేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్, పిల్లలతో కలిసి ఆదివారం బాపట్ల జిల్లా బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామ శివార్లలోని పొలాల్లో వరి నారు నాటారు. తాము కూడా ఆరుగాలం శ్రమించే రైతన్నలమే అంటూ వ్యవసాయం పట్ల మక్కువ చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular