తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన అనంతరం నేరుగా తిరుమల కొండపై ఉన్న పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడినుంచి ముందుగా బేడి ఆంజనేయ స్వామీ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ సిఎం జగన్ కు తిరునామం పెట్టి, శిరో వస్త్రం అర్చకులు కట్టారు. దానిపై పట్టువస్త్రాలు పెట్టుకొని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి వాటిని సమర్పించారు. తర్వాత రంగనాయకుల మండపంలో సిఎం జగన్ కు వేదం పండితులు ఆశీర్వచనం అందించారు. పేద శేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.