బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐబిఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయ పాలన పాటించడంలేదని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల లోపు మాత్రమే ఈ షో ను ప్రదర్శించేలా చూడాలని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రైమ్ టైమ్ లో ఈ షో ప్రసారం కాకుండా చూడాలని కోరారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది. కాగా, బిగ్ బాస్ షో లో అశ్లీలతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా దానికి న్యాయస్థానం సమ్మతించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చే విషయమై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : బిగ్ బాస్ 6 కి షాకింగ్ టీఆర్పీ?