Saturday, March 14, 2026
Homeసినిమామరోసారి ‘ఉప్పెన’ కాంబినేషన్?

మరోసారి ‘ఉప్పెన’ కాంబినేషన్?

ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు బుచ్చిబాబు సానా. తొలి ప్రయత్నంలోనే హిట్ సాధించిన బుచ్చిబాబుతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపించారు. అయితే.. బుచ్చిబాబు తదుపరి చిత్రాన్ని మైత్రీ సంస్థలో జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు. ఎన్టీఆర్ కి కథ చెప్పడం.. సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇవ్వడం జరిగింది. అయితే.. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాలతో ఓ సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు.

ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే.. రెండేళ్ల వరకు ఆగాలి కాబట్టి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని కథ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అందుచేత స్టార్స్ తో సినిమా చేయాలంటే చాలా టైమ్ పడుతుందని అసలు విషయాన్ని గ్రహించిన బుచ్చిబాబు తదుపరి చిత్రంగా ఓ మీడియం బడ్జెట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. మరో విషయం ఏంటంటే.. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టిలతోనే సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి.. బుచ్చిబాబు తదుపరి చిత్రం గురించి త్వరలో అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular