Friday, June 12, 2026
HomeTrending Newsదుర్గమ్మను దర్శించుకున్న సిఎం జగన్

దుర్గమ్మను దర్శించుకున్న సిఎం జగన్

దసరా నవరాత్రుల సందర్భంగా నేడు  కనక దుర్గమ్మ అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం (మూలా) సందర్భంగా  విజయవాడ  ఇంద్రకీలాద్రిపై  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న సిఎం కు మంత్రులు, అధికారులు, ఆలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఆ తర్వాత ఆలయంలోకి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనతరం ఆలయ మండపంలో సిఎం జగన్ కు పండితులు వేదం ఆశీర్వచనం అందించారు. ఉపముఖ్యమంత్రి (దేవాదాయ) కొట్టు సత్యనారాయణ, ఈవో భ్రమరాంభ సిఎంకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular