ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం పుష్ప. ఈ సినిమా బన్నీ, సుక్కు ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ లో పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా.. అక్కడ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 పై తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది.
ఇదిలా ఉంటే… పుష్ప మూవీలో హిందీలో బాగా ఆడినా… తెలుగునాట మాత్రం ఇది పెద్దగా ఆడలేదు. ఆ విషయాన్ని దర్శకుడు తేజ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దర్శకుడు తేజ ఓ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడారు. “చాలా మంది అనుకుంటున్నట్లు పుష్ప తెలుగులో పెద్ద హిట్ కాదు అని తేల్చి చెప్పారు. చాలా మంది థియేటర్ల ఓనర్లకు డబ్బులు రాలేదు” అన్నారు.
తేజకి కూడా థియేటర్ల బిజినెస్ ఉంది. సినిమా వ్యాపార లావాదేవీలు బాగా తెలుసు. అట్టర్ ప్లాఫ్ అయిన రాధేశ్యామ్ కొన్ని చోట్లా లాభాలు వచ్చాయట ఇది తేజ మాట. తేజ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా తీశారు. అదే ‘అహింస’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల గురించి తన అభిప్రాయం చెప్పారు. అయితే… తేజ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. మరి తేజ సంచలన వ్యాఖ్యల పై అల్లు అర్జున్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి