Friday, June 12, 2026
HomeTrending Newsప్రగతి భవన్ లో దసరా పూజలు

ప్రగతి భవన్ లో దసరా పూజలు

దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.

 

అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు.

పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సిఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా.. ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular