Sunday, November 24, 2024
HomeTrending Newsమాకు మరో ప్రతిపక్ష పార్టీ... అంతే: బొత్స

మాకు మరో ప్రతిపక్ష పార్టీ… అంతే: బొత్స

ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండబోదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాము కాకుండా మరో ఎనిమిది పార్టీలు ఉన్నాయని, ఇది కూడా మరో పార్టీ అవుతుందన్నారు. తమకు మరో ప్రతిపక్ష పార్టీ అవుతుందన్నారు, ప్రస్తుతం ఉన్న పార్టీలతో ఎలాంటి ప్రభావం ఉందో ఇది కూడా అంతేనని వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లో పోటీ ఉన్నప్పుడే బాగుంటుందన్నారు.  వారి పార్టీని భారత దేశం అని పెట్టుకోవచ్చు ప్రపంచ దేశాలు అని పెట్టుకోవచ్చని అది వారిష్టమని ఎద్దేవా చేశారు.

ఉత్తరాంధ్ర జిల్లాలు తెలుగుదేశం హయంలో ఏం చేశారో చెప్పాలని బొత్స మరోసారి డిమాండ్ చేశారు. ఈ విషయమై బహిరంగ చర్చకు రావాని సవాల్ చేశారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే తరహాలో అశోక్ గజపతి రాజు మాట్లాడతారని ఎద్దేవా చేశారు.  2014 నాటికి తోటపల్లి రిజర్వాయర్ 85 శాతం పూర్తి చేశామని, మిగిలిన 15 శాతం ఐదేళ్ళలో పూర్తి చేయలేకపోయారని బొత్స విమర్శించారు.

రైతుల ముగుసులో తెలుగుదేశం పార్టీ  పాదయాత్ర చేస్తోందని,  రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారని.. ఇదే విషయాన్ని ఎప్పుడైనా చెబుతానని స్పష్టం చేశారు. వారేమైనా త్యాగం చేస్తున్నారా, ఓ సామాజిక అంశం కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Also Read :  ఆలోచించాల్సిన పనిలేదు : బిఆర్ఎస్ పై సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్