Sunday, September 22, 2024
Homeసినిమాఅక్టోబర్ 21న 'ధమాకా" టీజర్

అక్టోబర్ 21న ‘ధమాకా” టీజర్

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా‘ పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

సినిమా మొదటి రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అక్టోబర్ 21, ఉదయం 10:01 గంటలకు మాస్ క్రాకర్ (టీజర్)ని విడుదల చేయనున్నారు. టీజర్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రెండు వేర్వేరు పోస్టర్లను విడుదల చేశారు. ఒక పోస్టర్ రొమాంటిక్ సైడ్ అయితే, మరొకటి యాక్షన్ సైడ్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజ.వాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘ధమాకా’ నిర్మాతలు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్